ఇన్ఫెక్షన్‌ సోకకుండా వాడే శానిటైజర్లను చర్మ సంరక్షణకు వాడవచ్చని సౌందర్య నిఫుణులు సూచిస్తున్నారు.

శానిటైజర్‌ను డీప్‌ క్లెన్సర్‌గా ఉపయోగించవచ్చు. దీనితో ముఖాన్ని తుడిస్తే ముఖం మీద డస్ట్‌ పోతుంది.

ఫేస్‌ పౌడర్‌ లేనప్పుడు హ్యాండ్‌ శానిటైజర్‌ను ముఖానికి రాయవచ్చు. దీనివల్ల ముఖం మ్యాట్‌ లుక్‌లో మెరుస్తుంది.

వేడి వల్ల ముఖం, చేతుల మీద గుల్లలు (ర్యాష్‌) ఏర్పడ్డ ప్రాంతంలో శానిటైజర్‌ రాసుకుంటే దురద తగ్గుతుంది.

జిడ్డు కారుతున్న ముఖాన్ని శానిటైజర్‌లో ముంచిన దూదితో తుడిస్తే జిడ్డు తగ్గి ఫ్రెష్‌గా కనిపిస్తుంది

అయితే వీటిలో ఏది చేయాలన్నా ఆ శానిటైజర్‌ మీ చర్మానికి నప్పుతుందో లేదో ఒకసారి పరీక్షించిన తరువాతే ముఖానికి వాడాలి.

బెండకాయ ముక్కలని వేయించేటప్పుడు ఉప్పు వేయకూడదు. అంతేగాక ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టకూడదు.

యాలకులను తొక్క తీయకుండా దోరగా వేయించి మిక్సీజార్‌లో వేసి, కొద్దిగా పంచదార వేసి మెత్తగా పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి.

ఇది ఎక్కువ కాలంపాటు తాజాగా ఉంటుంది. దీనిని పాలు, టీ, వివిధ రకాల తీపి వంటకాలలో ఇన్‌ స్టంట్‌గా వాడుకోవచ్చు.