బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లో సహజసిద్ధమైన పదార్థాలతోనే ముఖాన్ని మెరిపించవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్‌ గుణాలు పచ్చి పాలల్లో పుష్కలం. ఇవి క్లెన్సర్, టోనర్‌లుగా పనిచేస్తాయి.

ఎక్కువ సమయం పాటు తేమనందించి, చర్మాన్ని పొడిబారకుండా చూస్తాయి.

కాబట్టి పచ్చి పాలను ముఖానికి రాసి 5 నిమిషాలపాటు మర్దన చేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

లేదంటే.. రాత్రి ముఖానికి రాసి ఉదయం కడిగేయవచ్చు.

ఇలా తరుచుగా చేస్తే ముఖం మీద ఉన్న మచ్చలు పోయి ముఖం మెరుపుని సంతరించుకుంటుంది.

కుంకుమ పువ్వులో యాంటీ ఏజింగ్, ఔషధ గుణాలు పుష్కలం. చర్మ పోషణకు తోడ్పడుతుంది.

కుంకుమ పువ్వు రేకులను పచ్చిపాలలో నానబెట్టి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల తరువాత తుడిచేయాలి.

ఇలా చేయడం వల్ల చర్మానికి చక్కటి పోషణ అందుతుంది.