రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు తీసుకోవాలి.

ఇందులో మూడు టేబుల్‌ స్పూన్ల టోమాటో రసాన్ని కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాలపాటు మర్దన చేసి ఆరిన తరువాత కడిగేయాలి.

ఈ ప్యాక్‌లో క్యాల్షియం, విటమిన్‌ డి, బీకాంప్లెక్స్, ప్రోటీన్‌లు ఉండి చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది.

ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది.

ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు ఆహారంలో భాగంగా తీసుకుంటే చర్మ కాంతి మెరుపులీనుతుంది.

పసుపు కలిపిన పాలు తరచుగా తాగడం వల్ల ముఖంపై పేరుకుపోయిన టాన్‌ తొలగి సహజమైన మెరుపు వస్తుంది.