గుండ్రంగా, ఉబ్బరంగా ఉన్న ముఖ కవళికలు, ముడతలు పడి పేలవంగా కనిపిస్తున్న మోముకు ఇంగ్లీష్‌ అక్షరాలతో చెక్‌ పెట్టవచ్చు.

ముఖం కాస్త ముడతలు పడగానే యాంటీ ఏజింగ్‌ క్రీములు కొనేసి రాసేస్తుంటారు.

కానీ ఇంగ్లీషు అక్షరాలు “ఓ’ “ఈ’ లను పలకడం ద్వారా ఈ ముడతలు పోతాయి.

ఐదు నిమిషాలకోసారి ‘ఓ’ను, తరువాత ‘ఈ’ ని పలకడం ద్వారా ముఖం మీద ఏర్పడిన ముడతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

ఇలా చేయడం వల్ల చర్మం గట్టిపడి నిండుగా కనిపిస్తుంది. ఈ ఫేషియల్‌ వ్యాయామం వల్ల గుండ్రంగా పప్పీగా అనిపించే ముఖం కూడా మెరుపుని సంతరించుకుంటుంది.

కొబ్బరినూనెలో పోషకాలతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఔషధగుణాలు మెండుగా ఉంటాయి.

కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని ముఖానికి రాసి గుండ్రంగా మర్దనా చేసినా సాగిన చర్మం గట్టిగా మారి ముఖం యవ్వనంగా మారుతుంది.

నేలమీద గానీ, కుర్చీలో గానీ కూర్చుని ముఖాన్ని కుడివైపు, ఎడమవైపు తిప్పుతూ ఉండాలి.

ఇలా పదినిమిషాలు చేస్తే కండరాలపై ఒత్తిడి పడి గడ్డం, మెడమీద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.