ఎంతో అందమైన గణాభరణాలు

ప్రస్తుతం సంప్రదాయ దుస్తులతో పాటు ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ డ్రెస్సులకు కూడా టెంపుల్‌ జ్యువెలరీ ధరిస్తున్నారు.

మరి.. ఈ టెంపుల్‌ జ్యువెల్రీలో పార్వతి తనయుడే ప్రధానంగా వెలిగిపోతున్నాడు. గణాలకు అధిపతి బంగారు కాంతుల్లో అందంగా ఇమిడిపోతున్నాడు.

అభయముద్ర గణపతి, శాంత గణపతి, పుష్పాసీనుడైన గణపతి, శీర్ష గణపతి మూర్తులుగా హారాల్లో వైవిధ్యంగా ఆకట్టుకుంటున్నాడు.

వెండి, బంగారమే కాదు ఇతర ఫ్యాషన్‌ ఆభరణాల్లోనూ మేటిగా ఘనతను చాటుతున్నాడు.

ఇంకెందుకు ఆలస్యం మీ జువెలరీ బాక్స్‌లోనూ ఈ ఆభరణాలు చేర్చుకోండి మరి!