ఎండుకొబ్బరిలో విటమిన్‌ సి, ఈ, బీ6, ఐరన్‌, క్యాల్షియం, కాపర్, మ్యాంగనీస్, సెలీనియంలు పుష్కలంగా ఉంటాయి.

రోజుకో చిన్నముక్క ఎండుకొబ్బరి తినడం అలవాటు చేసుకుంటే ఎముకలకు బలం చేకూరుతుంది.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

రక్తహీనత కూడా తగ్గుతుంది.

కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్‌ యాసిడ్‌ మూలకేశాల నుంచి వెంట్రుకలకు ప్రోటిన్‌ అందిస్తుంది.

వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది.

కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు ఒత్తుగా పెరుగుతాయి.

15-20 నిముషాలు కొబ్బరినూనెతో మాడుపై మర్దన చేసి గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి.

తర్వాత షాంపుతో తల కడుక్కుంటే జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే సరి.