ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు.

కొన్ని పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరట నిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు.

శ్రమకోర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు నేర్పు, ఓర్పుతో పరిష్కరించు కుంటారు.

ఇంటాబయటా మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్‌.

ఉద్యోగార్ధుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు.

నూతన ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు.

విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటì నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో అదనపు బా«ధ్యతలు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి.

కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది.

వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి. ఆరోగ్య పరంగా కొంత చికాకు ఎదురుకావచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రారంభంలో సమస్యలు కొంత చికాకు పర్చినా అ«ధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు.

ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది. ఇంట్లో వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.