నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. మీఖ్యాతి మరింత విస్తరిస్తుంది. మీ మాటే చెల్లుబాటు కాగలదు. ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

కొత్త పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు.

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఎటువంటి పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలోని ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు.

వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త నయమనిస్తుంది. రుణభారాలు తగ్గే అవకాశం. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు.

కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. అందరిలోనూ మీసమర్థత చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

ఎటువంటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.

కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్నింటా సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి తోడ్పాటునిస్తారు.

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యభంగం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తత పాటించండి.

పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు.