పనులు సజావుగా పూర్తికాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. అందరిలోనూ మీ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో విజయాలు సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు

పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో లేనిపోని వివాదాలు. అనుకోని ప్రయాణాలు

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మిత్రులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి శుభవర్తమానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో చిక్కులు తొలగుతాయి.

నూతన వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యదీక్షాపరులై విజయాలు సాధిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. జీవితాశయం నెరవేరుతుంది.

అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సలహాలు పొందుతారు.

ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు అధిగమించి లబ్ది చేకూరుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు.

దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలై అవసరాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారవచ్చు.