ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వారం ప్రారంభంలో కొన్ని సమస్యలతో సతమతమవుతారు. కానీ రానురాను ఈ పరిస్థితి మారి ఉత్సాహంగా గడుపుతారు. అవసరాల మేరకు డబ్బు సమకూరే సూచనలు.

ముఖ్య వ్యవహారాలను రాజీపడకుండా పూర్తి చేస్తారు. విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఒక సమస్య పరిష్కారానికి కుస్తీపడతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబసభ్యుల వైఖరితో కొంత కలత చెందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా నలుగుతున్న గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.

దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థికంగా బలోపేతం. రుణభారాలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది. భూవివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. కొన్ని వ్యవహారాలలో రాజీలేకుండా ముందుకు సాగుతారు. వాహనయోగం.

దూరపు బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఎంతటి పరిస్థితినైనా చక్కదిద్దుకుని ముందుకు సాగుతారు.

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొన్ని పనులు ఇతరుల ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తారు.

అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. కుటుంబ సమస్యలు క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఎదుటవారి నుండి విమర్శలు ఎదురైనా సహనం పాటించండి.

కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ జీవనపయనం సాగిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకునేందుకు యత్నిస్తారు. వివాహాది శుభకార్యాలపై బంధువులతో చర్చలు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు.

వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. యుక్తి, సహనంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి.