మీలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయమై మీకు విశేషంగా సహకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. దూరపు బంధువులు మీపై మరింత ప్రేమను కనబరుస్తారు.

మీ చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆపదలో ఉన్నవారికి అభయహస్తం అందిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరులు, స్నేహితులతో వివాదాలు కొంత సర్దుబాటు చేసుకుంటారు.

మీ వ్యవహారశైలిపై కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.

విలాస జీవనం గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలలో విజయం మీదే. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు.

కొన్ని కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. మీ ఆశయాలు సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. ఎటువంటి నిర్ణయమైనా తేలిగ్గా తీసుకుంటారు.

రాబడి అంతగా లేకున్నా అవసరాలకు లోటు ఉండదు. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. బంధువులు మీపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. ఆపన్నులను సైతం ఆదుకుంటారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. వివాహ యత్నాలలో బిజీగా గడుపుతారు.

ఖర్చులు అదుపులో ఉంచుకుని పొదుపు పాటిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. కోర్టు వ్యవహారాలలోనూ కొంత ప్రగతి కనిపిస్తుంది.

అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకునే యత్నాలు ఫలిస్తాయి.

ముఖ్యమైన పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. బంధువుల ఆదరణ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.