పనుల్లో కొన్ని అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మధ్యలో విరమిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

సన్నిహితులతో సత్సబంధాలు. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కుటుంబసభ్యులతో విభేదాలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా గడుపుతారు.

వ్యయప్రయాసలు. బంధువుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనాలు కొంటారు. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి.

రుణాలు చేయాల్సిన పరిస్థితి. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.

ఇంటాబయటా సమస్యలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం చేసుకుంటారు.