ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు.

సాహసోపేత నిర్ణయాలతో చేపట్టిన కార్యాలలో విజయాలు సాధిస్తారు.

నూతన గృహ వస్తు వాహనాలను సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అదృష్టం కలిసివస్తుంది.

సంఘంలో పేరుప్రతిష్ఠలు కలిగి ఉంటారు. ఉన్నతస్థానాలను సాధిస్తారు. దైవభక్తి, శ్రద్ధ కలిగి ఉంటారు.

కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి.

అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు.

రాజకీయాలలో ఉన్నత పదవులను అందుకోగలుగుతారు. జీవితంలో ఘనవిజయాలు సాధిస్తారు.

ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది.

గడచిన కొన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అన్నివిధాలుగా సానుకూల ఫలితాలను అందుకోగలుగుతారు.

ఆర్థికంగా కూడా బాగుంటుంది. తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి.

వివాహాది వ్యవహారాలు, నూతన స్వగృహం ఏర్పాట్లు ఈ సంవత్సరం సానుకూలపడతాయి.

నూతన పదవీప్రాప్తి వుంది. గృహయోగం, వాహనయోగం కలుగుతుంది.