బుడ్డోడి జనగణమన.. వైరల్‌ వీడియో

‘జనగణమన అధినాయక జయహే..’  ఈ పాట ఎవరూ పాడినా..ఎప్పుడు పాడినా భారతీయులు గుండెలు ఉప్పొంగుతాయి. దేశభక్తి పెల్లుబుక్కుతుంది. మరి ముద్దొచ్చే ఓ చిన్నారి పాడితే.. ఈ వీడియో వైరల్‌ కాకుండా ఎలా ఉంటుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.జాతీయ గీతాన్ని మనస్సుపెట్టి హృదయం ఉప్పొంగేలా చిన్నారి ఆలపిస్తున్న ఈ వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. నోరు సరిగ్గా తిరగకపోయినా.. జాతీయ గీతంలోని కొన్ని చరణాలను కలిపేస్తూ.. చివర్లో కొన్ని చరణాలను మరిచిపోయి.. బుడ్డుడో లీనమై దేశభక్తి చాటేలా పాడిన తీరు నెటిజన్లను ముగ్ధులను చేస్తోంది. చిరుప్రాయంలోనే జాతీయగీతాన్ని గుర్తుంచుకొని పాడిన బుజ్జాయిని అభినందిస్తూ.. ప్రశంసిస్తూ నెటిజన్లు ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top