పెళ్లికి ఓకే అంటే ఇక్కడ టిక్‌ చేయ్‌!

లండన్‌ : ఏ పని చేసినా.. అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటారు కొందరు. అలాంటి కొద్దిమందిలో ఒకడు ఈ స్టోరీలోని ప్రేమికుడు. తన ప్రియురాలిని ‘‘ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’అని అడగటానికి ఏకంగా ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని నార్‌ఫోక్‌, గ్రేట్‌ యార్‌మౌత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రేట్‌ యార్‌మౌత్‌కు చెందిన 33ఏళ్ల స్మిటెన్‌ బ్రూనో నివెస్‌ తన ప్రియురాలు పాట్రికా కలాడో 34ను పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. అయితే తన పెళ్లి ప్రపోజల్‌ను ఎలా ఆమెకు చెప్పాలో తెలియలేదు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ ఓ ట్యాటూలు వేసే షాపు దగ్గరకు వెళ్లారు. పాట్రికా బయట ఉండగా..  స్మిటెన్‌ లోపలికెళ్లి ట్యాటూ వేయించుకోసాగాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top