మరణం చూసి బతికాడు..!

తిరువనంతపురం: కళ్లముందే మృత్యు ఘడియలు నృత్యం చేసి.. మరల దూరంగా వెళ్లిన భయానక అనుభవం కేరళలోని ఓ వ్యక్తికి ఎదురైంది. ఒక్కసారీగా మరణం అంచుకు వెళ్లి తిరిగి వచ్చాడు ఆ యువకుడు. వివరాలు.. కేరళ రాష్ట్రంలోని కోజికొడ్‌లో ఓ ప్రైవేట్‌ బస్‌ డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. బస్‌ను వేగంగా నడపటంతో ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌ బస్‌ను ఫుట్‌పాత్‌కు దగ్గరగా అతివేగంగా నడిపాడు. రోడ్డును దాటడానికి ప్రయత్నించిన ఓ స్కూటర్‌ నడిపే వ్యకి ఒక్కసారిగా బస్‌ కింద పడ్డాడు. కానీ బస్‌ డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో.. బస్‌ స్కూటర్‌ను చాలా దూరం వరకు లాక్కొని పోయింది. దీంతో ఆ వ్యక్తి బస్‌ టైర్‌లో చిక్కుకున్నాడు. బస్‌ కొంచం వేగం తగ్గాక అతడు అందులో నుంచి బయట పడ్డాడు. ఈ ప్రమాదంలో బస్‌ టైర్‌ కిందపడ్డ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫుట్‌పాత్‌ మీద ఉన్న రెండు బైకులు దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదం అంతా ఫుట్‌పాత్‌ పక్కన ఓ దుకాణంలో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. తాజాగా ఈ వీడియో షోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. అయితే కేరళలో రోజుకు సమారు 12 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలన్ని అతి వేగం కారణం జరుగుతున్నాయని తెలుస్తోంది. 
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top