వీడియో: పైలట్‌ మొగుడి పైశాచికం!

సాక్షి, హైదరాబాద్‌: లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త నిజాలు వెల్లడవుతున్నాయి. తాజాగా బయటపడ్డ వీడియోలో పైలట్‌ మొగుడి పైశాచిక చర్యలు వెలుగుచూస్తున్నాయి. ప్రేమ పేరుతో లావణ్య వెంటపడ్డ వెంకటేశ్‌ వివాహమైన అనంతరం ఆమెను వదిలించుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. పిల్లలు పుట్టడం లేదనే సాకుతో ఆమెకు నిత్యం వేధించేవాడని వీడియో ద్వారా స్పష్టమవుతోంది. లావణ్య కళ్లముందే వెంకటేశ్‌ పలువురు యువతులతో సరసాలు ఆడేవాడని, వారితో న్యూడ్‌గా మాట్లాడి ఆమెను మానసికంగా టార్చర్‌ చేశాడని వెల్లడైంది. వెంకటేశ్‌ ఆగడాలపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని లావణ్య మహిళా సంఘాలు డిమండ్‌ చేస్తున్నాయి.

కాగా, భర్త వేధింపుల కారణంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాళ్లగూడకు చెందిన లావణ్య (32) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త వెంకటేశం జెట్‌ ఎయిర్‌ వేస్‌ పైలట్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. తన చావుకు భర్తే కారణమంటూ లావణ్య ఫేస్‌బుక్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ‘‘వాడి మీద ప్రేమ ఉంది.. అందుకే సూసైడ్‌ చేసుకుంటున్నాను. వాడు చేసేవి తట్టుకోలేక చనిపోతున్నాను. ఒకసారి ప్రేమిస్తే చచ్చేవరకు ప్రేమించాలని అనుకున్నాను. నేను తప్పులు చేసి రియలైజ్‌ అయ్యాను. కానీ, వాడు అవ్వటం లేదు... ’’ అంటూ ఆమె కంటతడి పెట్టుకుంది. మరోవైపు లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top