ఈ తండ్రీకూతురు చెత్తను ఎలా పడేస్తారంటే?

స్పెయిన్‌కు చెందిన ఆ తండ్రీకూతుర్లు చెత్తను పడేయటానికి ఓ వెరైటీ పద్దతిని ఫాలో అవుతున్నారు. ఇంటినుంచి బయట చెత్త పారేసేందుకు వెళ్లిన ప్రతీసారి ఫేమస్‌ హాలీవుడ్‌ సినిమా పాత్రల్లా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని చెబుతున్న నేపథ్యంలో జామీ అనే వ్యక్తి ఈ నిర్ణయానికి వచ్చాడు. మొదట్లో  జామీ ఒకడే వెరైటీ దుస్తుల్లో చెత్త పడేయటానికి వెళ్లేవాడు. ఆ తర్వాతినుంచి కూతుర్ని కూడా వెంటబెట్టుకెళుతున్నాడు. 

ఇప్పటివరకు వారు ప్రముఖ హాలీవుడ్‌ సినిమాలకు సంబంధించిన పాత్రలు బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌, డ్రాగన్‌ బాల్‌ జెడ్‌, ఫ్రోజెన్‌, టాంగ్లడ్‌, స్పైడర్‌ మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌, వండర్‌ ఉమన్‌ తదితరాలకు సంబంధించిన దుస్తులు ధరించారు. ప్రస్తుతం ఈ తండ్రీకూతుర్లు వింత దుస్తుల్లో చెత్త పారేయటానికి వెళుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను చూస్తున్న నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top