న‌దిలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని..

కాలిఫోర్నియా: నీళ్ల‌లో కొట్టుకుపోతున్న ఓ యువ‌కుడిని అధికారులు ర‌క్షించిన ఘ‌ట‌న కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఓ యువ‌కుడు న‌గ‌రంలోని ఏంజెల్ జ‌ల‌పాతాన్ని ఆస్వాదిస్తూ దాన్ని దాటేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో కాలుజారి ప‌ట్టుత‌ప్పి అందులోనే ప‌డిపోయాడు. దీంతో అత‌ను వేగంగా వ‌స్తున్న నీటి ఉధృతికి బెంబేలెత్తుతూ సాయం కోసం అర్థించాడు. అప్ప‌టికే శ‌రీర‌మంతా నీళ్ల‌లో మునిగిపోగా త‌ల మాత్ర‌మే పైకి క‌నిపిస్తోంది. మ‌రోవైపు నీళ్లు సెక‌నుకు 50 నుంచి 80 అడుగుల వేగంతో ప్ర‌వ‌హిస్తుండ‌టంతో ఏ క్ష‌ణ‌మైనా అత‌ను కొట్టుకుపోయే ప్ర‌మాదం ఉంది. ఇత‌డిని గుర్తించిన డాన్లీ స‌హా ఇత‌ర‌ అధికారులు వెంట‌నే అత‌డిని ర‌క్షించేందుకు పూనుకున్నారు. ముందుగా యువ‌కుడికి క‌ర్ర‌ను అందించారు. కానీ అది అత‌డి చేయికి అంద‌లేదు.

దీంతో డాన్లీ త‌న బ్యాగు ప‌ట్టీని తాడుగా ఉప‌యోగించి క‌ర్ర‌కు క‌ట్టాడు. అనంత‌రం బాదితుడికి అందించ‌గా అత‌ను దాన్ని ఆసరాగా చేసుకుని ఒడ్డుకు వ‌చ్చాడు. రెండు రోజుల క్రితం నాటి ఈ వీడియోను అక్క‌డి అధికారులు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. యువ‌కుడిని ప్రాణాల‌తో కాపాడిన‌ అధికారి డాన్లీని నెటిజ‌న్లు పొగుడుతున్నారు. "నోటికి ప‌ని చెప్ప‌కుండా మెద‌డుకు ప‌ని చెప్పావ"‌ని కీర్తిస్తున్నారు. "వీరు సాయం చేయ‌క‌పోయుంటే అత‌ని ప‌రిస్థితి ఏమ‌య్యేదో ఊహించుకోడానికే భ‌యంక‌రంగా ఉంద‌"ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. "ఈ స‌మ‌యంలో న‌దులు, చెరువుల‌కు దూరంగా ఉండండ‌"ని మ‌రో నెటిజ‌న్ స‌ల‌హా ఇచ్చాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top