డబ్బా మొత్తం నాకే; అమ్మదొంగా!

ఆహారం కోసం బయల్దేరిందో ఎలుగుబంటి. కానీ ఎక్కడా ఏమీ కనిపించకపోవడంతో చెత్త డబ్బా దగ్గరికెళ్లి ఏమైనా దొరుకుతుందోమోనని దానిని తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఎంతసేపటికి అది ఓపెన్‌ కాకపోవడంతో ఏకంగా డబ్బా మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్లింది. ఈ సరదా సంఘటన కొలెరెడోలో చోటుచేసుకుంది. ‘పాపం ఎలుగుబంటి దొంగగా మారింది. కానీ దురదృష్టవశాత్తు ఆహారం సంపాదించలేకపోయింది. కాబట్టి దానికి ఎటువంటి శిక్ష వేయబోము’ అంటూ కొలెరెడో పార్క్స్‌, వైల్డ్‌లైఫ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఎలుగుబంటి వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కొలెరెడో వైల్డ్‌లైఫ్‌ అధికారి మాట్లాడుతూ... ఆహారం కోసం ఎలుగుబంట్లు రాత్రుళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top