దొంగపై విరుచుకుపడిన 11ఏళ్ల అమ్మాయి

తల్లి స్కూటర్‌ను దొంగలించాలని చూసిన ఓ వ్యక్తికి చుక్కలు చూపిందో చిన్నపిల్ల. అతడిపై పంచులు కురిపించి, ప్రాణాలకు భయపడి పరుగులుపెట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలోని జరేట్‌లో బుధవారం రాత్రి ఓ మహిళ తన ఇంటి సమీపంలో స్కూటర్‌పై కూర్చుని ఉంది. ఇంతలో అటువైపుగా వెళుతున్న ఓ దొంగ ఆమె వద్దకు వచ్చి, స్కూటర్‌ను లాక్కోటానికి చూశాడు. అదే సమయంలో అక్కడికి కొద్దిదూరంలో హెల్మెంట్‌ ధరించి నిలబడి ఉన్న 11ఏళ్ల ఆమె కూతురు అతడిపై విరుచుకుపడింది. ముఖంపై చేతితో పంచులుకురిపించింది. మరుక్షణంలో ఆమె తల్లి కూడా అతడిపై దాడిచేయటం ప్రారంభించింది. అనుకోని ఈ హఠాత్‌ పరిణామానికి దొంగ బిక్కచచ్చిపోయాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top