ఈనాటి ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్‌ సూర్యనారాయణ అన్నారు. జిఎన్‌ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియా సపోర్ట్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. అభివృద్ధిని సమతుల్యం చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు.నన్ను ద్వేషించండి, నా దిష్టిబొమ్మలు దగ్దం చేయండి. కానీ భారత్‌ను మాత్రం ద్వేషించకండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాల ప్రచారం, ఆందోళనలను ఆయన దుయ్యబట్టారు. కావాలంటే తనను ద్వేషించాలని... అంతేకానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివారం ట్టిటర్‌లో ఓ ప్రముఖ కవి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘హిందూస్తాన్‌ ఏ ఒక్కరి సొత్తుకాదు. ఈ దేశ మట్టిలో అందరి ర​క్తం ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top