సిక్స్‌ సిక్సెస్‌ బాధిత బౌలర్‌ ఏమన్నాడంటే

 మైదానంలో మహరాజు టీమిండియా యువరాజ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచానికి గుర్తుకొచ్చేది సిక్స్‌ సిక్సెస్‌. సోమవారం ఈ సిక్సర్ల కింగ్‌ తన ఆటకు గుడ్‌బై చెప్పడంతో అతని అభిమానులు ఆటగాళ్లు ఆ మహాద్భుత ఘట్టాన్ని నెమరువేసుకుంటున్నారు. ‘భారత క్రికెట్‌లో నీది చెరపలేని చరిత్ర.. మరవలేని యాత్ర.. మరెవరిని ఊహించలేని పాత్ర’ అంటూ ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్‌ బ్యాట్‌కు బలైన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ యువీ రిటైర్మెంట్‌పై స్పందించాడు. ‘ ఓ దిగ్గజం నీ రిటైర్మెంట్‌ను ఆస్వాదించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top