చాలెంజ్‌లో ఓడిన హిట్‌ మ్యాన్‌

ప్రపంచకప్‌ 2019 కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు ఆటగాళ్లు ఆటవిడుపు కోసం నగరం వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. అన్ని జట్ల సారథులతో ఫోటో షూట్‌లో పాల్గొని, చిట్‌ చాట్‌ చేశారు. అలాగే కొంత మంది ఆటగాళ్లు సేదతీరడం కోసం లండన్‌ వీధుల్లో విహరిస్తున్నారు. ఈ సమయంలోనే వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. అయితే ఆ చాలెంజ్‌లో హిట్‌ మ్యాన్‌ ఓడిపోయాడు.  దీనికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం రోహిత్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top