ఒకే ఓవర్‌లో రెండు గోల్డెన్‌ డక్‌లు

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకంది. కివీస్‌ ఓపెనర్లు ఇద్దరూ అనూహ్యంగా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఈ సీజన్‌లో తన దైన మార్క్‌తో ఆకట్టుకుంటున్న షెల్డన్‌ కాట్రెల్‌ కివీస్‌ను కోలుకోని దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే కివీస్‌ స్టార్‌ ఓపెనర్‌ను వికెట్ల ముందు​ దొరకబుచ్చుకున్న కాట్రెల్‌ అదే ఓవర్‌ ఐదో బంతికి మరో ఓపెనర్‌ కోలిన్‌ మన్రోను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో కివీస్‌ తన ఇద్దరు ఓపెనర్లను తొలి ఓవర్‌లోనే కోల్పోయింది. ఇలా ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top