హెలికాప్టర్‌ షాట్‌తో అదరగొట్టిన పాండ్యా..!

హెలికాప్టర్‌ షాట్‌.. అనగానే ఠక్కున గుర్తొచ్చే మహేంద్రసింగ్‌ ధోనీ. తనదైన స్టైల్‌లో ధోని హెలికాప్టర్‌ షాట్‌ ఆడితే.. అభిమానులకు కన్నులపండుగగా ఉండేది. ఇప్పుడు ఆ షాట్‌ ఆడటంలో అచ్చం ధోనీని తలపిస్తున్నాడు హార్దిక్‌ పాండ్యా. తాజాగా ఢిల్లీ క్యాపిటల్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో హెలికాప్టర్‌ షాట్‌తో పాండ్యా సిక్సర్‌గా మలిచాడు. రబడా వేసిన చివరి ఓవర్‌లో మణికట్టు మాయాజాలంతో బంతిని అమాంతం గాల్లోకి లేపి సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతికే పాండ్యా ఔటయ్యాడు. అయితే, హార్దిక్‌ ఆడిన హెలికాప్టర్‌ షాట్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ షాట్‌ ఆడగానే.. జట్టులోని తోటి సభ్యుడైన కీరన్‌ పోలార్డ్‌ కూడా చప్పట్లతో స్వాగతించాడు. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top