పృథ్వీ షా మెరుపులు.. రోహిత్ శర్మ ఫిదా

భారత యువ ఓపెనర్ పృథ్వీ షా సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 134, 70, 33 (నాటౌట్‌ ) పరుగులు సాధించి అరంగేట్రంలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పృథ్వీ షా.. దేశవాళీ మ్యాచ్‌ల్లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. బుధవారం బెంగళూరు వేదికగా హైదరాబాద్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (61; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం బాదాడు. దాంతో ముంబై అలవోకగా ఫైనల్‌కు చేరింది.మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అంబటి రాయుడు (11) విఫలమైనా.. రోహిత్ రాయుడు (121 నాటౌట్: 132 బంతుల్లో 8x4, 3x6) అజేయ శతకం బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదన‌కి దిగిన ముంబయి జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (17: 24 బంతుల్లో 2x4)తో నెమ్మదిగా ఆడినా.. పృథ్వీ షా మాత్రం భారీ షాట్లతో చెలరేగిపోయాడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top