అశ్విన్‌ ఔట్‌పై కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

ఐపీఎల్‌లో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 17 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా, ఆపై కింగ్స్‌ పంజాబ్‌ ఏడు వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఔటైన తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రియాక్షన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. బౌండరీ లైన్‌ వద్ద కోహ్లి క్యాచ్‌ పట్టడంతో అశ్విన్‌ పెవిలియన్‌ చేరాడు. అయితే కోహ్లి క్యాచ్‌ అందుకున్న తర్వాత అనుచిత వ్యాఖ్యలతో అశ్విన్‌కు సెండాఫ్‌ పలికినట్లు వీడియోలో కనబడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top