సారీ సర్ఫరాజ్‌!

 ‘పందిలా బలిసావు.. డైట్‌ చేయవచ్చు కదా’ అంటూ పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై నోరుపారేసుకున్న ఓ అభిమాని ఎట్టకేలకు తన తప్పును తెలుసుకున్నాడు. సోషల్‌మీడియా ప్రభావంతో తన తప్పును తెలుసుకొని సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు.  ‘పాక్‌ కెప్టెన్‌ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనతో బాధపడ్డ ప్రతి ఒక్కరికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అసలు ఆ వీడియోనే అప్‌లోడ్‌ చేయలేదు. అది ఎలా వైరల్‌ అయ్యిందో నాకు తెలియదు. కానీ నేను చేసింది చాలా తప్పు. సర్ఫరాజ్‌తో ఉన్న చిన్నారి తన కొడుకని నాకు తెలియదు.’ అంటూ క్షమాపణలు కోరాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top