కోహ్లి స్టన్నింగ్ క్యాచ్
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. టీ విరామం అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్కోంబ్ ఏడు పరుగుల వద్ద విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, పీటర్ హ్యాండ్స్ కోంబ్ క్యాచ్ వీడియో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 55వ ఓవర్ తొలి బంతిని పీటర్ హ్యాండ్స్ కోంబ్ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. మెరుపు వేగంతో స్పందించిన విరాట్ కోహ్లి కుడి చేత్తో అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్‌గా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు