ఆ క్రికెట్ షాట్‌కు పేరేమిటో?
టీమిండియాతో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో మెరుపులాంటి ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాను గెలిపించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. 27 బంతుల్లో 47 పరుగులు సాధించి సఫారీలకు సునాయాస విజయాన్ని అందించాడు. క్లాసెన్ హెల్మెట్ పెట్టుకుని ఆడుతుంటే అచ్చం న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గుఫ్టిల్ను తలపిస్తాడు. ఇదిలా ఉంచితే, ఇన్నింగ్స్ 22వ ఓవర్లో భారత స్పిన్నర్ చాహల్ ఆఫ్ స్టంప్ అవతలికి షార్ట్ పిచ్ బంతిని విసరగా.. క్లాసెన్ ఆ బంతిని వెంటాడి మరీ స్వేర్‌లెగ్ వైపు బౌండరీగా మలిచిన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చగా మారింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు