‘ధోని ముందు ఆ షాట్‌.. చాలా ప్రత్యేకం’

మిస్టర్‌ కూల్‌  ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో 100వ విజయాన్ని నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. సొంత మైదానంలో ఈ చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంలో ముంబై ఆటగాడు హార్థిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌తో.. ఆ తర్వాత బౌలింగ్‌తో అదరగొట్టి ఆల్‌రౌండ్‌ షోతో ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో బ్రేవో బౌలింగ్‌ను చీల్చి చెండాడిన తీరు.. అతడి బౌలింగ్‌లో పాండ్యా బాదిన ‘ధోని స్పెషల్‌- హెలికాప్టర్‌ షాట్‌’ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఈ విషయం గురించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పాండ్యా మాట్లాడుతూ... ‘ ధోని భాయ్‌ ముందు హెలికాప్టర్‌ షాట్‌ కొట్టడం నాకు చాలా ప్రత్యేకం. నాకు తెలిసి.. ఈ షాట్‌ గురించి ఎంఎస్‌ నన్ను కచ్చితంగా మెచ్చుకుంటాడని ఆశిస్తున్నా’  అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top