అతని సత్తా ఏంటో నాకు తెలుసు

‘ధోని 2004లో జట్టులోకి వచ్చాడు. అతని ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో 7 స్థానంలోనే బ్యాటింగ్‌కు చేశాడు. అయితే పాకిస్తాన్‌తో వైజాగ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా అతను 7వ స్థానంలోనే బ్యాటింగ్‌ చేయాలని ముందురోజు నిశ్చయించుకున్నాం. ఆ సమయంలో నేను నా గదిలో కూర్చోని న్యూస్‌ చూస్తున్నాను. ధోనిని మంచి ఆటగాడిగా ఎలా మార్చాలని ఆలోచించాను. అతని సత్తా ఏంటో నాకు తెలుసు. మరుసటి రోజు మ్యాచ్‌లో టాస్‌ నెగ్గాం. వెంటనే అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్‌ పంపించాలని డిసైడయ్యాను. ఏం జరిగినా పర్వాలేదనుకున్నాను. 7 స్థానంలో బ్యాటింగ్‌ కదా అని సిద్దం కాకుండా ధోని కూర్చొని ఉన్నాడు. నేను ‘ధోని నీవు మూడో స్థానంలో బ్యాటింగ్‌ వెళ్తున్నావు’ అని చెప్పా. వెంటనే అతను మరి మీరు అని అడిగాడు. నేను నాలుగో స్థానంలో వస్తానని చెప్పా.’  అని నాటి రోజులను గంగూలీ గుర్తు చేసుకున్నాడు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top