అమ్మా.. ధోనికే మన్కడింగా?

మన్కడింగ్‌.. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో రచ్చలేపిన అంశం. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ విధానంలో ఔట్‌ చేయడంతో​ ఈ నిబంధనపై తీవ్ర చర్చనీయాంశమైంది. అశ్విన్‌ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు, క్రీడా విశ్లేషకులు దుమ్మెత్తిపోసారు. అయితే ఈ తరహా ఔట్‌ క్రికెట్‌ నిబంధనల్లో ఉన్నప్పటికి.. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఉందని తీసేయాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. గతంలో చాలా సార్లు ఈ తరహాలో తీసినప్పటికి.. కొందరు క్రీడా స్పూర్తితో బ్యాట్స్‌మన్‌ను వెనక్కి పిలిచిన సందర్భాలు ఉన్నాయి.

అయితే తాజాగా మరోసారి మన్కడింగ్‌ పదం చర్చనీయాంశమైంది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కృనాల్‌ పాండ్యా ఈ తరహా ఔట్‌కు ప్రయత్నించాడు. కానీ చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని ఆ అవకాశం ఇవ్వలేదు. కేదార్‌ జాదవ్‌కు బంతి వేయాల్సిన కృనాల్‌ ఒక్కసారిగా ఆగి నాన్‌స్ట్రైకర్‌ ధోనిని హెచ్చరించాడు. కానీ ధోని తన బ్యాట్‌ను క్రీజులోనే ఉంచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ సందర్భంగా కామెంటేటర్స్‌ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ధోని తన 15 ఏళ్ల కెరీర్‌లో మైదానంలో ఏ మాత్రం అలసత్వంగా ఉండలేదని, అది వికెట్ల వెనుకాలనైనా.. క్రీజులోనైనా అని వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. అమ్మా..ధోనికే మన్కడింగా అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top