స్టన్నింగ్‌ క్యాచ్‌కు నెటిజన్ల ఫిదా

పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ అనూహ్యంగా డ్రాగా ముగిసింది. గెలుపుపై ధీమాతో బరిలో దిగిన పాక్‌కు డ్రాతో ఆసీస్‌ చెక్‌ పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌ చివరి రోజు ఆటలో పాక్‌ ఆటగాడు బాబర్‌ అజమ్‌ అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌కు సోషల్‌ మీడియా ఫిదా అయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 128వ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్‌ మిచెల్‌ స్టార్క్‌ బంతిని లెగ్‌సైడ్‌ ఆడగా.. అక్కడే షార్ట్‌ ఫార్వార్డ్‌ ఫీల్డర్‌గా ఉన్న బాబర్‌ అజమ్‌ అద్భుత డైవ్‌తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌తో స్టార్క్‌తో పాటు మైదానంలోని ఆటగాళ్లంతా సంభ్రమాశ్చర్యానికి  గురయ్యారు. నెటిజన్ల అయితే సోషల్‌ మీడియా వేదికగా సూపర్‌ మ్యాన్‌ బాబర్‌ అజమ్‌ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top