జైపూర్ వేదికగా ముంబై రాజస్తాన్‌ మ్యాచ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా శనివారం ఇక్కడ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్తాన్‌ రాయల్స్‌ ఎనిమిది మ్యాచ్‌లకు గాను రెండింట్లో మాత్రమే గెలుపొందింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం నమోదు చేసింది. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై ఇండియన్స్‌ భావిస్తోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top