ఆ బంగారం వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముంగిట ఉంచాలి

తమిళనాడు పోలీసులు బుధవారం సీజ్‌ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముంగిట ఉంచాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మొత్తం వ్యవహారం గురించి ప్రజలు వివరాలను కోరుకొంటున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని చెన్నైలోని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమినాడు ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం ముమ్మర తనిఖీలు చేస్తుండగా బుధవారం మూడు వాహనాలల్లో 1381 కేజీల బంగారం తరలిస్తుండంగా పట్టుబడిందన్నారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top