నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో

2019లో వైఎస్‌ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని వైఎస్సార్‌సీపీ నేత, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు.‘లోకేష్‌లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్‌ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన చరిత్ర మీ కుటుంబానికి లేదు’  అని విమర్శించారు. ఒక్కసారి జగన్‌ సీఎం అయితే జీవితాంతం అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భయం టీడీపీకి ఉందని ఎద్దేవా చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం అవుతుందని తేల్చి చెప్పారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top