‘సిగ్గూ, శరం లేకుండా.. బాబు పనిచేశారు’

చంద్రబాబుకు తెలిసిన ఏకైక ‘విద్య’, ‘సామర్థ్యం’ 3ఎమ్‌ (మనీ, మీడియా, మానిప్యులేషన్స్)లు మాత్రమేనని విమర్శలు గుప్పించారు. ‌వీటిని బాబు తన మూడు దశాబ్దాల రాజకీయ అనుభవంతో తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో .. సిగ్గూ, శరం లేకుండా ప్రదర్శించారని నిప్పులు చెరిగారు. ఒక దశలో బాబు వ్యూహాలు తెలంగాణలో ఎన్నికల ఫలితాలను నిర్ధేశిస్తున్నాయన్న తీరుగా ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఏపీలో, జాతీయ స్థాయిలో చంద్రబాబుకు లబ్ది పొందాలని చూశారని ఎద్దేవా చేశారు. కూటమి 70 స్థానాలకు వరకు గెలవబోతోందని మీడియా తప్పుడు ప్రచారాలు చేసి గందరగోళం సృష్టించిందని అన్నారు. చంద్రబాబు రాకతో టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పక్కకు తొలగి.. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌, చంద్రబాబుకు మధ్యజరిగే పోరులా మారిపోయాయని అభిప్రాయపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top