నిసిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారనే అసత్య ప్రచారంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మద్దతిచ్చింది వైఎస్సార్సీపీకా లేక ప్రత్యేక హోదాకా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నిలదీశారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్కు కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చాడని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడం చంద్రబాబు చూశారా నిలదీశారు. కేసీఆర్ చంద్రబాబుకు ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా అని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు