35వ రోజు పాదయాత్ర డైరీ

అనంతపురం జిల్లాలో పాదయాత్ర మొదలై పది రోజులైపోయింది. ప్రజల అభిమానం, ఆప్యాయతల మధ్య ఈ పదిరోజులు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు. ఓ ప్రభంజనంలా నా కోసం తరలివస్తూ.. నాతో నడుస్తున్న జనాన్ని చూస్తుంటే ‘నాన్నగారు నాకెంతో పెద్ద కుటుంబాన్నిచ్చాడు’ అన్న నా మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఉదయం పాదయాత్ర మొదలై కందుకూరు చేరుకోగానే మహేశ్వరి, ఆమెతో పాటు మరికొందరు మహిళలు వచ్చి కలిశారు. ‘అన్నా.. పాల ఉత్పత్తిలో కందుకూరు ఒకప్పుడు జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండేది. నాన్నగారు పశుక్రాంతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికీ గేదెలు, ఆవులు ఇచ్చారు. ప్రతి ఇంట్లో రెండు మూడు పాడి పశువులకు తక్కువ ఉండేవి కావు. పంటలు పండకపోయినా.. పాడి డబ్బులతో ఇళ్లు గడిచేవి.. పిల్లల్ని చదివించుకున్నాం.. అందుకే పెద్దాయనంటే మాకంత ప్రేమ, అభిమానం’ అని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top