మహిళను వెంబడించి చోరీకి పాల్పడ్డారు

బ్యాంకులో భారీ మొత్తంలో నగదు డ్రా చేసిన ఓ మహిళను వెంబడించి కొందరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో చోటుచేసుకున్న పెనుగులాటలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వ్యాపార అవసరాల కోసం 75 వేల డాలర్లలను (దాదాపు 52 లక్షల రూపాయలు) బ్యాంకు నుంచి ఓ మహిళ డ్రా చేశారు. హ్యుస్టన్‌లోని బ్యాంకు నుంచి బయటకు రాగానే దుండగులు ఆమెను వెంబడించడం ప్రారంభించారు. తనకు చెందిన వలేరో గ్యాస్‌ స్టేషన్‌ వద్దకు మహిళ రాగానే, మరో కారులో నుంచి ఓ దుండగుడు దిగి పరుగున  ఆమె దగ్గరకు వచ్చి బ్యాగులాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top