సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లో మంగళవారం మధ్యాహ్నం తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసీ బస్సు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని చిదిమేసింది. ఈ ప్రమాదంలో ఉద్యోగిని తన స్కూటీతో బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. ఆమె తల హెల్మెట్‌తో సహా ఛిద్రమైపోయిం ది. ఆమెను 50 మీటర్ల మేర, స్కూటీని వంద మీటర్ల మేర బస్సు ఈడ్చుకెళ్లింది. స్థానికులు దాడిచేసి, చెప్పే వరకు ఇంత ఘోరం జరిగినట్టు తెలియదని ఆ బస్సు డ్రైవర్ అంటున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని గ్రీన్ బంజారా కాలనీలో నివసించే సోహిని సక్సేనా (35) కొండాపూర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హెచ్ఆర్ విభాగంలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. ఆమె భర్త వినీత్‌కుమార్ మాధూర్ గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు