ఉత్తరఖండ్‌లో అరుదైన మంచు చిరుత !
ఉత్తరఖాండ్‌లోని ఓ మంచు చిరుత పులి రోడ్డు పై సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిరుత పులి గంగోత్రి నేషనల్ పార్కు పక్కన ఉన్న రోడ్డు మీద నుంచి నడుస్తూ ఓ పర్వతం వైపు వెళ్లింది. ఆ మంచు చిరుత పులి ప్రపంచలోనే చాలా ప్రత్యేకమైన జాతికి చెందినదంట్టూ.. దాని వీడియోను పర్వీన్ కస్వాన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో.. ‘ పర్వతాల దెయ్యం.. ప్రపంచంలోనే అరుదైన జాతి చిరుత.. గంగోత్రి నేషనల్ పార్క్ దగ్గర రోడ్డు మీద చూడోచ్చు’ అనే కాప్షన్ తో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటజన్ ‘ ఆ చిరుతను చూసిన వారు చాలా అదృష్టవంతలని.. మరో నెటిజన్ ఆ మంచు చిరుత చాలా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి