రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ ఘనవిజయం

అమెరికా, బ్రిటన్‌లతో తీవ్రమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రష్యన్లు మరోసారి వ్లాదిమిర్‌ పుతిన్‌(65)కే పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్‌ పార్టీ నేత పావెల్‌ గ్రుడినిన్‌కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో 2024 వరకూ పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా నియంత జోసెఫ్‌ స్టాలిన్‌ (24 ఏళ్లు) తర్వాత అత్యధికకాలం రష్యాను పాలించిన నేతగా పుతిన్‌ రికార్డు సృష్టించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top