టిక్‌టాక్‌ వీడియో వైరల్‌తో మనస్తాపం..

పేదరికంతో బాధ పడుతున్న కుటుంబానికి అండగా నిలవాలని ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన శివకోడు గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహనకుమార్‌ (30) ఈ నెల 3వ తేదీన అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు వేసుకున్న చీటీ పాట సొమ్ము చెల్లించలేదని అతడి ఫొటోలతో టిక్‌టాక్‌లో పెట్టిన వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో మనస్తాపం చెందిన అతడు కువైట్‌లో నివాసం ఉంటున్న కాంప్లెక్స్‌లో ఉరి వేసుకున్నాడు. వారం తర్వాత ఆదివారం అతడి మృతదేహం శివకోడు చేరుకుంది. చేతికి అందివచ్చిన కొడుకు కువైట్‌ వెళ్లి విగతజీవిగా రావడంతో తల్లి విజయకుమారి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శివకోడు చేరుకున్న మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top