సీనియర్ పాత్రికేయుడు కుల్‌దీప్ నయ్యర్ కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్‌, కాలమిస్టు కుల్దీప్ నయ్యర్(95) ఇక లేరు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు. 1923 ఆగష్టు 14న జన్మించిన ఆయన ఉర్ధూ పత్రిక అంజమ్‌లో జర్నలిస్ట్‌గా కేరీర్‌ ప్రారంభించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.  'బిట్వీన్‌​ ది లైన్స్‌' పేరుతో ప్రచురితమైన కాలమ్‌ దాదాపు 80 పత్రికల్లో ప్రచురితమయ్యింది. జర్నలిస్ట్‌గానే కాకుండా మానవ హక్కుల ఉద్యమకారుడిగా కుల్దీప్ అనేక పోరాటాలు చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top