నిజాం వారసులే గెలిచారు

1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్‌ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్‌ (సుమారు ఒక మిలియన్‌ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లోని పాకిస్తాన్‌ హై కమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top