ప్రేమ చిచ్చు..?

వాళ్లిద్దరూ పదో తరగతి విద్యార్థులు.. ఒకే స్కూల్‌లో చదువుతున్నారు... ఒకరికి తెలియకుండా ఒకరు వారి స్కూల్లోనే చదివే ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ.. విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేకపోయారు. చెబితే ఎక్కడ కాదంటుందోనని పెదవి దాటనీయలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఎక్కడ తప్పుబడతారోనని.. ఎక్కడ కాదంటారోనని... ఎవరికివారే మానసిక ఆవేదనకు గుర య్యారు. ఇటీవలే తాము ప్రేమించింది ఒకే అమ్మా యిని అని తెలుసుకున్నారు. అమ్మాయి లేకుండా ఉండలేమని భావించారు. చదివే వయసులో ప్రేమేంటని స్కూల్‌ యాజమాన్యం ప్రశ్నిస్తుందనుకున్నారో.. లేక పెద్దలు కొడతారని భయపడ్డారో... తెలియదు కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలిద్దామని నిర్ణయించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నుంచి కలసి తిరిగిన ఇద్దరూ రాత్రి 7 గంటలకు ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. మైకం వచ్చిన తర్వాత మద్యంతోపాటు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వీరిలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థిని కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే అతనూ చనిపోయాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top