రాజాధానిలో సర్కారు..భూగుట్టు..

ఏపీ రాజధాని నిర్మాణం ముసుగులో ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీ అధికారికంగా బట్టబయలైంది. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల సన్నిహితుల రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారుల దాడులతో మొత్తం అవినీతి బాగోతం వెలుగు చూసింది. 6,000 ఎకరాల్లో అక్రమంగా రూ.8,000 కోట్ల విలువైన లావాదేవీలు సాగించారని మొదటి దశ దాడుల్లో ఐటీ శాఖ నిర్ధారించింది. ఆ భూముల ప్రస్తుత విలువ ఏకంగా రూ.30,000 కోట్లని అంచనా వేయడం గమనార్హం. నూతన రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మిస్తారన్న దానిపై అస్మదీయులకు ముందుగానే లీకులు... బినామీ పెట్టుబడిదారులతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు... బ్యాంకుల నుంచి నిబ«ంధనలకు విరుద్ధంగా రుణాలు... రాజధాని ప్రాంతంలో తక్కువ ధరకే భూముల కొనుగోలు... ఇదీ ప్రభుత్వ పెద్దల దోపిడీ విధానం. దీనిపై సీబీఐ, ఆర్‌బీఐ, ఈడీ, డీఆర్‌ఐలకు కూడా ఐటీ శాఖ సమచారం ఇవ్వడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు మొదలైనట్లు సమాచారం.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top